
ప్రస్తుతం పెళ్లిళ్లీ సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఒక్కొక్కరూ పెళ్లిపీటలెక్కారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి అవంతి శ్రీనివాసన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేసింది.

ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో అత్యాచారానికి గురైన అమ్మాయి పాత్రలో నటించింది అపూర్వ శ్రీనివాసన్. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి ప్రేమలో హీరో స్నేహితురాలిగా నటించి మెప్పించిందీ అందాల తార.

కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించని అపూర్వ శ్రీనివాసన్ సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ సర్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తితో ఏడడుగులు నడిచినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది అపూర్వ. అలాగే పెళ్లి ఫొటోలను కూడా అందులో షేర్ చేసింది.

ఈ సందర్భంగా అపూర్వ మెడలో మూడు ముడులు వేసిన తర్వాత భార్యను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు శ్రేయాస్ శివ కుమార్. ప్రస్తుత వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.