Sampath Raj: ’23 ఏళ్లకే పెళ్లైపోయింది.. నా కూతురికి నాలుగేళ్లప్పుడు మేము విడాకులు తీసుకున్నాం’

|

May 05, 2023 | 9:29 AM

గంభీరమైన కంఠం.. ఆరు అడుగుల కటౌట్‌తో విలన్‌ పాత్రలకు పెట్టింది పేరు సంపత్‌ రాజ్‌. ఆరు భాషల్లో వందకుపైగా సినిమాలు చేసినా ఇప్పటికీ మిర్చి విలన్‌గానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు..

1 / 5
గంభీరమైన కంఠం.. ఆరు అడుగుల కటౌట్‌తో విలన్‌ పాత్రలకు పెట్టింది పేరు సంపత్‌ రాజ్‌. ఆరు భాషల్లో వందకుపైగా సినిమాలు చేసినా ఇప్పటికీ మిర్చి విలన్‌గానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు.

2 / 5
దమ్ము, పంజా, మిర్చి.. వంటి పలు మువీల్లో నటించిన సంపత్‌ టాలీవుడ్‌లో టాప్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

3 / 5
నిజానికి సంపత్‌ చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారట. ఆయన తల్లికి సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. చదువు రాని వాళ్లు, పనికిమాలిన వాళ్లు మాత్రమే సినిమాల్లోకి వెళ్తారని భావించేవారు. ఐతే సంపత్‌ నాన్న మాత్రం ‘నువ్వు ఇలాగే అమ్మకి భయపడుతూ ఉంటే సినిమాల్లోకి వెళ్లలేవు. ఇంట్లో నుంచి పారిపో' అన్నారు. అలా ఇంటి నుంచి పారిపోయి సినిమా అవకాశాల కోసం వేట ప్రారంభించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

4 / 5
'తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చే సమయానికి అమ్మగారు కాలం చేశారు. తను ఉండి ఉంటే నా విజయాన్ని చూసి చాలా సంతోషించేవారు. నాకు 23 ఏళ్లకే పెళ్లైపోయింది. మా అమ్మాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు నా భార్యకు విడాకులిచ్చాను'.

5 / 5
చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవడమే బహుశా మా విడాకులకు కారణమై ఉండొచ్చు. సామరస్యంగానే మేము విడిపోయాం. ఇప్పటికీ మేము మాట్లాడుకుంటాం. మా అమ్మాయి బాధ్యత నేనే తీసుకున్నాను. తను కూడా వాళ్లమ్మను కలుస్తుంటుంది. నా కూతురు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుందని సంపత్‌ రాజ్‌ తన వ్యక్తిగత జీవితం గురించి తెలిపారు.