Cinema : దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్.. ఓటీటీలో సైకో థ్రిల్లర్ దూకుడు..

Updated on: Nov 12, 2025 | 10:17 PM

సస్పెన్స్, ట్విస్టులు అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమాల్లో దృశ్యం ఒకటి. హిందీ, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషలలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను వెనక్కు నెట్టింది ఒక సైకో థ్రిల్లర్. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో రెండు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

1 / 5
భారతీయ సినీప్రియులకు సస్పెన్స్, థ్రిల్లర్, ఊహించని ట్విస్టులు అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమా దృశ్యం. కానీ ఈ సినిమాను మించిన ట్విస్టులతో సాగే సినిమా మరొకటి ఉందని మీకు తెలుసా.. ?2016 లో ఒక సైకో-థ్రిల్లర్ చిత్రం విడుదలైంది. ఇందులో నేటి అతిపెద్ద తారలు, ఒక నటుడు, ఒక అగ్ర నటి ప్రధాన పాత్రల్లో నటించారు.

2 / 5
ఈ సైకో థ్రిల్లర్ ఊహించని మలుపులతో సాగుతుంది. ఇందులో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాడు. ఆ సమయంలో అతను పెద్ద స్టార్ కాకపోయినా, "మసాన్" తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడు అయ్యాడు. ఈ సినిమా పేరు "రామన్ రాఘవ్ 2.0".

3 / 5
ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ రాత్రిపూట మహిళలను వేటాడి, చంపి, అత్యాచారం చేసే సీరియల్ కిల్లర్ రామన్ పాత్రను పోషించాడు. విక్కీ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. విక్కీ పాత్రధారి, ACP రాఘవన్, నిందితుడు రామన్‌ను పట్టుకోవడానికి వెతుకుతాడు. రామన్ పోలీసులకు లొంగిపోయి తొమ్మిది మందిని హత్య చేసినట్లు ఒప్పుకుంటాడు.

4 / 5
ఆ తర్వాత పోలీసులు అతన్ని జైలులో పెడతారు. రామన్ జైలు నుంచి తప్పించుకుంటాడు. తన సోదరి ఇంటికి వెళ్లి, తన సోదరిని, బావమరిదిని, మేనల్లుడిని హత్య చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయిలను హత్య చేసి అత్యాచారం చేయాలని ప్లాన్ చేస్తాడు.

5 / 5
 ఇందులో సిమి పాత్రలో శోభితా నటించింది. "రామన్ రాఘవ్ 2.0" క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో అనేక మలుపులు ఉన్నాయి. దీనికి IMDb రేటింగ్ 7.3. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.