
బాలయ్య హిట్ సాంగ్స్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది క్లాస్ హిట్ సాంగ్ ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో ‘రాళ్లల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు’ అంటూ సాగే పాట. ఇది ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్. తర్వాత స్థానంలో ఉన్న మరో పాట ‘మంగమ్మ గారి మనవడు’ మూవీలో ‘దంచవే మేనత్త కూతురా..’ సాంగ్. ఇది ఇప్పటి చాల వేడుకల్లో వినిపిస్తుంది.

అలాగే బాలయ్య నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ మూవీలో సిల్క్ స్మిత చేసిన సాంగ్ ‘జానవులే నెరజానవులే’ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్టులో బెస్ట్ సాంగ్ ఇది. బాలయ్య నెగిటివ్ షేడ్స్‌లో కనిపించిన ‘సుల్తాన్’ మూవీలో ‘ఓ కలికి రామ చిలకా’ సాంగ్ ఇప్పట్టి వింటూనే ఉంటాం.

బాలకృష్ణ, సౌందర్య జంటగా వచ్చిన ‘టాప్ హీరో’లో ‘సామజవరగమన’ అంటూ సాగె క్లాసిక్ ఇప్పటికి ఎందరికో ఫేవరిట్. బాలయ్యతో పాటు క్కినేని నాగేశ్వరరావుతో పాటు ఈ సాంగ్‌లో మోహన్ లాల్ గెస్ట్ రోల్‌లో నటించిన ‘గాంఢీవం’ మూవీలో ‘గోరువంక వాలగానే’ సాంగ్ ఇప్పట్టికి ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటారు.

‘సమర సింహా రెడ్డి’ మూవీలో అన్ని సాంగ్స్ హిట్. అయితే ‘చలిచలిగా ఉందన్నాడే’ అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సింహా’ సినిమాలో అన్ని పాటలు బాగున్నా ‘బంగారు కొండ’ సాంగ్ మంత్రం చాలామందికి ఫెవరెట్.

‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్య స్వయంగా ఆలపించిన ‘మామా ఏక్ పెగ్ లా’ సాంగ్ ఇప్పటికీ దాదాపు అన్ని పార్టీల్లో వినిస్పిస్తుంది. ఈ లిస్టులో బాలకృష్ణ లేటెస్ట్ సాంగ్ ‘దబిడి దిబిడి’ కూడా ఉంది. ‘డాకు మహారాజ్’ మూవీలో ఈ పాట ట్రెండ్ సెట్ చేసింది.