
కుబేరా : కుబేరా మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైంది. ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. శేఖర్ కమ్ముల , ధనుష్ కాంబోలో రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, ఈ మూవీ కేవలం 132 కోట్లు మాత్రమే వసూలు చేసి, డిజాస్టర్‌గా మిగిలింది.

అజిత్ కుమార్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు ఈయన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అయితే 2025లో వచ్చి పట్టుదల మాత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 138 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా, కేవలం 132 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

కమల్ హాసన్ సినిమా అంటే ఆ హైపే వేరే లెవల్‌లో ఉంటుంది. అయితే స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. 280 కోట్లు పెట్టి తెరకెక్కించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా 97 కోట్లు మాత్రమే వసూల్ చేసి డిజాస్టర్ అయ్యింది.

స్టార్ హీరో విక్రమ్ నటించిన వీర ధీర శూరన్ అనే మూవీ కూడా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం అభిమానులు ఊహిచిన రేంజ్‌లో కాకుండా పర్వాలేదు అనిపించింది.

రెట్రో మూవీ బాక్సాఫీస్ వద్దా ఘోర పరాజయం అందుకుంది. ఈ మూవీలో సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ నటించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దర్శకుడు 150కోట్లతో తెరకెక్కించాడు. కానీ ఈ మూవీకి నెగటివ్ టాక్ రావడంతో, డిజాస్టర్‌గా మిగిలింది.