హీరోల లుక్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న మేకర్స్!

Updated on: Jan 23, 2025 | 12:34 PM

కథేంటో చెప్పకూడదు, కంటెంట్ ఎలా ఉంటుందో రివీల్ చేయకూడదు, జస్ట్ హీరో లుక్‌ మాత్రం చూపిస్తే చాలు.. ఆ సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. షూటింగ్ పూర్తయి, సినిమా రిలీజ్ అయ్యే వరకు డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. అందుకే అలాంటి క్రేజీ టీజర్స్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. సినిమాతో సంబంధం లేకుండా అంచనాలు పెంచేసేలా ఎనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేస్తున్నారు.

1 / 5
మేకర్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. సినిమా కథ‌ను రివీల్ చేయకుండా జస్ట్ వాళ్ల లుక్‌తోనే అభిమానులను తమ వైపుకు లాక్కుంటున్నారు.

2 / 5
జైలర్‌తో బిగ్ హిట్ ఇచ్చిన రజనీకాంత్‌, నెల్సన్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. జైలర్‌కు సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్టుగా అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసింది యూనిట్‌. అందుకోసం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇంకా స్టార్ట్‌ కాకపోయినా.. కేవలం ఎనౌన్స్‌మెంట్ వీడియో  కోసం భారీ యాక్షన్ బ్లాక్‌ను డిజైన్ చేసింది. ఈ వీడియోతో సినిమా స్కేల్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చింది యూనిట్‌.

3 / 5
రీసెంట్‌ టైమ్స్‌లో ప్రీ టీజర్‌ ట్రెండ్‌ గట్టిగా కనిపిస్తోంది. పుష్ప 2 రిలీజ్‌కు ముందు వేర్‌ ఈజ్‌ పుష్పరాజ్‌ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టీజర్‌లో ఉన్న కంటెంట్‌ సినిమాలో లేకపోయినా... మూవీ రిలీజ్‌ వరకు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయటంలో హెల్ప్ అయ్యింది ఆ ప్రీ టీజర్‌.

4 / 5
తెలుగుతో పోలిస్తే కోలీవుడ్ దర్శకులే ప్రీ టీజర్‌ ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ సెట్స్‌ మీద ఉన్న థగ్‌ లైఫ్‌, కూలీ సినిమాలకు కూడా షూటింగ్ ప్రారంభం కాకముందే టీజర్స్‌ రిలీజ్ చేశారు. క్యారెక్టర్‌ లుక్‌ ఫైనల్‌ కాగానే, ఆ లుక్‌లో ఓ వీడియో మాంటేజ్‌ను సిద్ధం చేసి రిలీజ్ చేస్తున్నారు.

5 / 5
ఈ ట్రెండ్‌ను మొదలైంది మాత్రం తెలుగు సినిమాతోనే. మహేష్‌ బాబు హీరోగా స్పైడర్ సినిమాను రూపొందించిన మురుగదాస్‌, ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ టీజర్‌ రిలీజ్ చేశారు. సినిమా కథకు సంబంధం లేకుండా కేవలం టైటిల్ జస్టిఫికేషన్‌ కోసం ప్లాన్ చేసిన స్పైడర్‌ టీజర్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేసింది.