
ఈ ఇయర్ ఎండింగ్ పుష్ప చేసే సందడిని న్యూ ఇయర్ బిగినింగ్‌లో ఎలాగూ బిగ్ మూవీస్ కంటిన్యూ చేయాలి. అయితే, వాటికన్నా ప్రెజర్ సమ్మర్ సినిమాల మీద ఉంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కాస్త ఎర్లీగానే స్టార్ట్ అవుతోంది.

2024లో మిస్ అయిన సీజన్‌ని 2025 ఎంత క్యాష్ చేసుకోబోతోంది? లెట్స్ వాచ్... 2025 సమ్మర్‌కి వచ్చేస్తున్నాం అని ఫస్ట్ ఖర్చీఫ్ వేసింది యష్. ఆయన నటిస్తున్న టాక్సిక్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్ చేయాలని ప్లాన్.

ఆల్రెడీ థౌజండ్ క్రోర్స్ క్లబ్‌లో మెంబర్‌షిప్ ఉన్న ఈయన నెక్స్ట్ సమ్మర్‌కి ఇంకో వెయ్యి కోట్లను టార్గెట్ చేస్తున్నారా? యష్ సంగతేమోగానీ, కాస్త ఎంటర్‌టైనింగ్‌గా, థ్రిల్లింగ్‌గా వెయ్యి కోట్లు పోగేయాలనే ఆలోచన మారుతి - ప్రభాస్ రాజాసాబ్‌లో కనిపిస్తోందంటున్నారు ట్రేడ్ పండిట్స్.

డిసెంబర్ 10వరకు జరిగే ఈ ఆఖరి షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. హరిహర వీరమల్లు షూటింగ్ అయిపోయాక,

కేవలం ఈ సినిమాలే కాదు, శివభక్తుడి సినిమా కన్నప్ప, గ్రాండ్‌గా తెరకెక్కుతున్న వీడీ 12, మలయాళం నుంచి విడుదలకు సిద్ధమవుతున్న ఎల్2 ఎంపురాన్, మాస్ మహరాజ్ మాస్ జాతర, నితిన్ తమ్ముడు.. ఇలా నెక్స్ట్ సమ్మర్‌కి క్యూలో క్రేజీ సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో కంటెంట్‌తో మెప్పించేవెన్ని... బాక్సాఫీస్ దగ్గర వేల కోట్లు కుమ్మరించేవి ఎన్ని.. అనే క్యూరియాసిటీ యమాగా ఉంది జనాల్లో.