
సక్సెస్ ఫుల్ ఫార్ములాను అంత త్వరగా పక్కన పెట్టేయాలనుకోవటం లేదు ఈ జనరేషన్ స్టార్స్. అందుకే హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ను ప్లాన్ చేస్తూ ఆ సక్సెస్ జోష్‌ను కంటిన్యూ చేస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ వెండితెర మీద సీక్వెల్ సినిమాల సందడే ఎక్కువగా కనిపించనుంది.

టాలీవుడ్‌లో కొత్త హిట్ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేకర్స్. తెర మీద న్యూ వరల్డ్ క్రియేట్ చేయటం కన్నా... ఆల్రెడీ సక్సెస్ ఇచ్చిన సేఫ్ థీమ్‌ను సీక్వెల్‌లో కంటిన్యూ చేసి ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. 2024లో ఇలాంటి సినిమాల మీదే ఫోకస్ ఎక్కువగా కనిపిస్తోంది.

కమల్ హాసన్ ఇండియన్ 2 ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 మీద కూడా బజ్ అదే రేంజ్‌లో ఉంది. ఇంకా పాన్ ఇండియా రేంజ్‌లో పర్ఫెక్ట్‌గా ప్రూవ్ చేసుకోకపోయినా... అడివి శేష్ చేస్తున్న గూఢచారి 2 మీద కూడా బజ్ గట్టిగానే వినిపిస్తోంది.

లైగర్‌తో పాన్ ఇండియా ప్రయోగం చేసి ఫెయిల్ అయిన పూరి జగన్నాథ్, మరోసారి అక్కడే సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లుకు కొనసాగింపుగా వస్తున్న టిల్లు స్క్వేర్ కూడా 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెక్ట్స్ ఇయర్ పొలిటికల్ థ్రిల్లర్ జానర్‌లోనూ సీక్వెల్స్ హవా కనిపిస్తోంది. ఆర్జీవీ వ్యూహంకు సీక్వెల్‌గా రూపొందుతున్న శపథం సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ హిట్ యాత్రకు కొనసాగింపుగా రూపొందుతున్న యాత్ర 2 కూడా 2024లో ఫస్ట్ క్వార్టర్‌లోనే రిలీజ్ కానుంది.