
అక్కడ కూడా మన డామినేషనే అంటావ్‌రా..! అదుర్స్ సినిమాలోని ఈ డైలాగ్ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు కదా..? మన హీరోలకు ఇది బాగా సూట్ అవుతుందిప్పుడు. ఆల్రెడీ బాలీవుడ్‌పై భారీ స్థాయిలో దండయాత్ర చేస్తున్నారు మన హీరోలు.. ఇది చాలదన్నట్లు మరో బాంబు కూడా బాలీవుడ్ హీరోలపై వేయబోతున్నారు. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

ఒకప్పుడు ఇండియన్ సినిమాలో బాలీవుడ్‌దే రాజ్యం. వాళ్లెంత చెప్తే అంత. కానీ కొన్నేళ్లుగా సీన్ మారుతుంది. ఆధిపత్యం పూర్తిగా టాలీవుడ్ చేతుల్లోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మన హీరోల చేతలు కూడా అలాగే ఉన్నాయి మరి. ఖాన్స్ సహా.. హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్ లాంటి హీరోలు సైతం కామ్ అయిపోయారిప్పుడు. ఇదే అదునుగా మన హీరోలు జెండా పాతేస్తున్నారు.

2023లో కనీసం గదర్ 2, జవాన్, పఠాన్, యానిమల్ లాంటి సినిమాలు రప్ఫాడించాయి. 2024లో అయితే మరీ దారుణం.. స్త్రీ 2 మినహాయిస్తే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ఒక్కటి లేదు. మధ్యమధ్యలో హనుమాన్, కల్కితో పాటు రీసెంట్‌గా దేవర అంటూ మన హీరోలే అక్కడి బాక్సాఫీస్‌కు అండగా నిలిచారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జరిగేలా కనిపిస్తుంది.

2025లోనూ భారీ సినిమాలేం వచ్చేలా కనిపించట్లేదు. సల్మాన్ ఖాన్ సికిందర్ వస్తున్నా.. మునపట్లా భాయ్ మ్యాజిక్ చేస్తారా అనేది అనుమానమే. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయింది. వార్ 2 ఒక్కటే కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తుంది.. అందులోనూ హృతిక్ రోషన్‌తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.

డిసెంబర్ 6న పుష్ప 2తో బాలీవుడ్‌ను రూల్ చేయడానికి బయల్దేరుతున్నారు బన్నీ. అలాగే జనవరి 10న గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్ రాబోతున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బానే ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ హను ప్రాజెక్ట్.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి ఫ్యూచర్‌లోనూ బాలీవుడ్‌పై మన డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది.