
టాలీవుడ్ సీనియర్స్‌లో నెంబర్ గేమ్ నడుస్తోంది. కుర్ర హీరోలు జోరు చూపిస్తుండటంతో సీనియర్స్ కాస్త స్లో అయ్యారు. కానీ వీళ్లో ఒక్కరు మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు.

మిగతా హీరోలు ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న టైమ్‌లో ఏకంగా హ్యాట్రిక్ హిట్స్‌తో ఫామ్ చూపిస్తున్నారు. యంగ్ జనరేషన్ హీరోలు ఎంత జోరు చూపించినా.. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున, వెంకటేష్ చేసే సినిమాల విషయంలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

కానీ ఈ సీనియర్స్ కొద్ది రోజులుగా అభిమానుల అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి కూడా ఒక్క హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఉంది.

విక్టరీ స్టార్ వెంకటేష్, కింగ్ నాగార్జున కూడా సక్సెస్‌ల విషయంలో వెనకబడుతున్నారు. కానీ ఈ సిచ్యుయేషన్‌లోనూ నందమూరి బాలకృష్ణ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

గత మూడు చిత్రాలతో బాలయ్య మార్కెట్ స్పాన్ ఎన్నో రెట్లు పెరిగింది. అఖండ సక్సెస్ బాలయ్య రేంజ్‌ను పీక్స్‌కు చేర్చిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అఖండ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్‌సీస్‌లోనూ బాలయ్యకు మార్కెట్ ఓపెన్ అయ్యింది.

ఆ సినిమాతో తొలిసారి ఓవర్‌సీన్‌లో వన్ మిలియన్ మార్క్‌ను టచ్ చేసిన బాలకృష్ణ, ఆ తరువాత వీర సింహారెడ్డితోనూ అదే ఫీట్‌ను రిపీట్ చేశారు.

ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరోసారి మిలియన్ మార్క్‌ను టచ్ చేసి సీనియర్స్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నది తాను మాత్రమే అని మరోసారి ప్రూవ్ చేశారు.