Hanuman: హనుమాన్ నమ్మకం అదేనా.. సంక్రాంతికి రావడంలో ఏంటి ధైర్యం..?
సంక్రాంతికి అరడజన్ సినిమాలకు పైగానే వస్తున్నాయి. అందులో అన్నీ మూడు రోజుల గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. దాంతో అసలు పండగ రేసు ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలోనే గుంటూరు కారం జనవరి 12న రావడం ఫిక్స్.. ఆ మరుసటి రోజే సైంధవ్ రాబోతుంది. జనవరి 14న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. ఈ మూడు సినిమాలు అయితే పక్కాగా వస్తున్నాయి.