
పాటలో నువ్ కావాలయ్యా అని అన్నారేమోగానీ, ఈ కాంట్రవర్శీని మాత్రం కావాలనుకోలేదు తమన్నా. సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకోన్ మధ్య జరుగుతున్న ఇష్యూలో లేటెస్ట్ ఎంట్రీ తమన్నా అంటూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

దీపికకు మిల్కీ బ్యూటీ సపోర్ట్ అదుర్స్ అంటోంది దీప్ సైన్యం. అప్పుడెప్పుడో చపాక్ ప్రమోషన్లలో దీపిక చెప్పిన మేల్ డామినేటెడ్ మాటల క్లిప్‌ని షేర్ చేశారు ఓ నెటిజన్. దానికి తమన్నా లైక్ కొట్టారు. ఈ క్లిప్ నెట్టింట్లో స్ప్రెడ్ అవుతోంది.

అయితే దానితో నాకేం సంబంధం లేదంటూ విసుక్కుంటూ తన స్టేటస్‌లో వీడియో పోస్ట్ చేశారు మిల్కీ.'నాకు తెలియకుండా ఇదెలా జరుగుతుంది? దీని సంగతేంటో చూడు' అంటూ కామెంట్ కూడా పెట్టారు తమన్నా.

'స్పిరిట్ స్టోరీని నమ్మి షేర్ చేసుకుంటే లీక్ చేయడమేంటి? కొత్త నటిని ఎదగనివ్వకుండా తొక్కేయాలని చూడటమేంటి?' అంటూ ఈ మధ్య సందీప్ పరోక్షంగా దీపిక మీద ఫైర్ అయ్యారు. దీని మీద హుందాగానే స్పందించారు దీపిక.

'నా మానసిక ప్రశాంతత నాకు ముఖ్యం. మనసు చెప్పిందే చేస్తా. నిజాయతీగా ఉంటా' అంటూ సందీప్ ప్రస్తావన లేకుండానే కౌంటర్ ఇచ్చారు దీపిక. ఈ టాపిక్ జరుగుతున్న ఈ టైమ్‌లో దీపిక పోస్టుకు తమన్నా లైక్ కొట్టడం... కాంట్రవర్శీని కోరి తెచ్చుకున్నట్టయింది.