
నటిసురేఖ కూతురు సుప్రీత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన తల్లి తో కలిసి పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసి .. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. తన తల్లి నటిగా అందరికీ తెలిసినప్పటికీ, సుప్రీత మాత్రం సోషల్ మీడియా ద్వారానే మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.

ఈ అమ్మడుకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక కొన్ని రోజుల క్రితం, సుప్రిత త్వరలో తెలుగు చిత్రపరిశ్రమలో సందడి చేయబోతుందని, స్టార్ హీరో సినిమాలోనే ఛాన్స్ కొట్టేసిందంటూ అనేక వార్తలు సోషల్ మీడియానే షేక్ చేశాయి.

ఇక వీటిపై స్పందించకుండా సుప్రిత ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన గ్లామర్‌తో నెట్టింట రచ్చ చేస్తూనే ఉంటుంది.ఈ ముద్దుగుమ్మకు కూడా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. వరసగా రీల్స్, ఫొటో షూట్స్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ చిన్నది.

ఇక ఎప్పుడూ పార్టీలు, బీచ్‌లో దిగిన గ్లామర్ ఫొటోస్ షేర్ చేసే ఈ చిన్నది, తాజాగా గుడిలో సంప్రదాయ పద్ధతిలో రెడీ అయిపో ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.

తన తల్లి సురేఖా వాణితో కలిసి గుడికి వెళ్లిన సుప్రీత అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వాటిని చూసిన అభిమానుల చీరలో చూడముచ్చగా, అచ్చం తెలుగు అమ్మాయిలా, అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.