Rajinikanth: వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
పాపం రోజంతా చెమటోడ్చేలా కష్టపడినా కూలీలకి దక్కేది వందల్లోనే..! కానీ అది బయటి కూలీలకు.. ఇక్కడో ఇంటర్నేషనల్ కూలీ ఉన్నాడు. ఆయన పని చేస్తే ఆస్తులు రాసివ్వాలి.. జీతం కోట్లలో ఇవ్వాలి. పని చేసినందుకు.. చేయించినందుకు ఇద్దరూ రికార్డ్ స్థాయిలో తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా కూలీలు..? వాళ్లకెందుకు అంత డిమాండ్..? ఊరు కాదు.. ఏకంగా ప్రపంచం మొత్తం మెచ్చిన పనివాడు కాబట్టే రజినీకాంత్‌కు ఈ రేంజ్ క్రేజ్ సొంతం.