తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు మంటల్లో దూకి..
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఈ హీరో స్టార్ హీరోగా తన సత్తాచాటుకున్నాడు. ఇక వీరి తల్లిదండ్రులు సునీల్ దత్, నర్గీస్ లు కూడా మంచి నటులే. సునీల్ దత్ చాలా సినిమాలు చేశారు. సునీల్ దత్ రేష్మ ఔర్ షెరా అనే సినిమా ద్వారానే సంజయ్ దత్ బాలనటుడిగా పరిచయం అయ్యాడు.
Updated on: Feb 18, 2025 | 4:38 PM

తాజాగా సంజయ్ దత్ తల్లిదండ్రులకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిది ప్రేమ వివాహం. సునీల్ దత్ నర్గీస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే సునీల్ దత్, నర్గీస్ కూడా పలు సినిమాల్లో నటించారు. కానీ ఓ సినిమాలో మాత్రం వీరు తల్లికొడుకులుగా నటించారు. అంతే కాకుండా ఆ సినిమా చేస్తున్న సమయంలోనే వీరి మధ్య స్నేహం పెరిగి చివరకు ప్రేమగా మారింది.

వీరు కొన్ని రోజుల పాటు ప్రేమించుకొని, తర్వాత బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి మ్యారేజ్ ఆ రోజుల్లో బాలీవుడ్ లోనే హాట్ టాపిక్‌గా మారింది.

అయితే వీరు మదర్ ఇండియా సినిమాలో నటిస్తున్న సమయంలో సెట్ లో వెల్డింగ్ మెషిన్ కారణంగా చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మంటల్లోనే నటి నర్గీస్ చిక్కుకుపోవడంతో ప్రాణాలకు తెగించి సునీల్ దత్ ఆమెను కాపాడాడు.

అంతే కాకుండా ఆమెను కాపాడే క్రమంలో ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. ముఖం కాలిపోయిందంట. దీంతో ఆమె దగ్గరుండి మరి సునీల్ దత్‌ను చూసుకోవడమే కాకుండా సపర్యలు కూడా చేసిందంట. అలా వీరి పరిచయం, ప్రేమ, మూడు ముళ్లతో ముడిపడిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.