
బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది అందాల భామ శ్రీముఖి. తన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రీముఖి.

మాటలతోనే కాదు అందంతోనూ కవ్విస్తుంది శ్రీముఖి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు పలు ఇంటర్వ్యూలతోనూ ఆకట్టుకుంది శ్రీముఖి.

ఇదిలా ఉంటే శ్రీ ముఖి పెళ్లి గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే చాలా సార్లు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది శ్రీముఖి.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చింది. అలాగే తన పెళ్లి గురించి కూడా హింట్ ఇచ్చింది

నెటిజన్స్ తో చిట్ చాట్ చేసిన శ్రీ ముఖిని ఓ నెటిజన్ లవ్ లో ఫెయిల్ అయ్యారా..? అని అడిగాడు. దానికి 'బొచ్చెడుసార్లు' అని చెప్పింది. అలాగే పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని శ్రీముఖి చెప్పింది.