Sreeleela: మరో యంగ్ హీరోతో జోడి కట్టనున్న శ్రీలీల.. జోరు తగ్గేలా లేదుగా..
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. తెలుగులో ఈసారి అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్. పెళ్లిసందడి అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఏకంగా పది సినిమాల్లో నటిస్తుండగా.. 8 మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.