
14 జూన్ 2001న USలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది క్యూటీ శ్రీ లీల. భారతదేశంలోని బెంగుళూరులో పెరిగింది. ఆమె తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్. ఈమె పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావుతో విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది.

శ్రీలీల చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఆమె డాక్టర్ కావాలన్న ఆశతో 2021లో MBBS పూర్తి చేసింది. 2019లో వచ్చిన కన్నడ రొమాంటిక్ చిత్రం కిస్‌లో మొదటిసారి కథానాయకిగా వెండి తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2021లో రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్గా తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది.2022లో ధమాకాలో కథానాయకిగా బ్లాక్ బస్టర్ అందుకుంది. 2023లో స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాల్లో కనిపించింది.

2024 సంక్రాంతికి మహేష్ సరసన గుంటూరు కారంలో నటించింది. అల్లు అర్జున్ పుష్ప 2లో ఓ స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేసింది. ప్రస్తుతం రవితేజకి జోడిగా మాస్ జాతర, నితిన్ సరసన రాబిన్హుడ్, పవన్ కళ్యాణ్ పక్కన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది.

తెలుగులో వరుస సినిమాతో బిజీగా ఉన్న ఈ క్యూటీ బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నట్టు వార్తలు వస్తున్నయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ క్యూటీ. ఇప్పుడు వీటిని తెగ వైరల్ చేస్తున్నారు కుర్రకారు.