ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. చేతిలో డజనుకుపైగా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు.. ఆదికేశవ, రామ్ పోతినేని మూవీ, గుంటూరు కారం చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమాలన్ని ఇప్పుడు సెట్స్ పై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.