
ఎవరి కథలో వాళ్లు హీరో అయితే.. అందులో వింతేముంది..? ఒకరి కథలోకి మరొకరు వచ్చినపుడే కదా అసలు మజా. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే జరుగుతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఓ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో స్టార్ హీరోలందరినీ కలిపేస్తున్నారు. తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది YRF. మరి ఈ స్పై యూనియర్స్‌లో ఎన్ని సినిమాలున్నాయి..?

యూనివర్స్ అనే మాట కేవలం హాలీవుడ్‌లోనే ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇండియన్ స్క్రీన్‌కు కూడా దీన్ని అలవాటు చేస్తున్నారు కొన్ని ప్రొడక్షన్ హౌజ్‌లు. అందులో భాగంగానే బాలీవుడ్ దిగ్గజ నిర్మాణసంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ క్రియేట్ చేసారు. అందులో షారుక్ ఖాన్ పఠాన్.. సల్మాన్ టైగర్.. హృతిక్ రోషన్ వార్ సినిమాలున్నాయి.

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తాజాగా వార్ 2 నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతుంది. అందులో హృతిక్ రోషన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

బ్రహ్మస్త్ర ఫేమ్ అయన్ ముఖర్జీ దీనికి దర్శకుడు. దేవర తర్వాత ఎన్టీఆర్ ఇమ్మీడియట్‌గా చేసే సినిమా ఇదే అని తెలుస్తుంది. అంతేకాదు ఫైటర్ సైతం స్పై యూనివర్స్‌లో భాగంగానే వస్తుంది.

ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత టైగర్ 3తో ఈ మధ్యే వచ్చారు సల్మాన్. ఈ యూనివర్స్ ఇక్కడితోనే అయిపోదని.. వరసగా ఇందులో సినిమాలు వస్తూనే ఉంటాయని యశ్ రాజ్ ఫిల్మ్స్ క్లారిటీ ఇస్తుంది. ప్రతీ సినిమాలోనూ ఇతర హీరోలు భాగం అవుతారంటున్నారు వాళ్లు. సౌత్‌లోనూ ఈ ట్రెండ్‌ను లోకేష్ కనకరాజ్ స్టార్ట్ చేస్తున్నారు.