అబ్బా.. ఆ స్టార్ హీరో మూవీ లో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్

|

Jan 14, 2025 | 5:41 PM

యంగ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ వరుస సినిమాలో చేస్తూ తన క్రేజ్‌కు పెంచుకుంటోంది. నాని ‘జెర్సీ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇటీవల ‘మెకానిక్ రాకీ’ తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ ఏడాది బాలయ్య సరసన ‘డాకు మహారాజ్’ సినిమాలో నటించింది. బాబి కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

1 / 5
శ్రద్ధా శ్రీనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. తన అంద చందాలతో నెట్టింట హోరెత్తిస్తుంటుంది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది.

2 / 5
మొట్టమొదట శ్రద్ధా శ్రీనాథ్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి తరువాత  కోహినూర్ అనే సినిమాతో మలయాళం  చిత్ర సీమకు పరిచయమైంది. ఆ తరువాత కన్నడలో ఆమె కొన్ని సినిమాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన 'యు టర్న్'ను తెలుగులో రీమేక్ చేశారు.

3 / 5
తెలుగు లో 'జెర్సీ' తర్వాత జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి సినిమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ నటించగా చివరిగా వెంకటేష్ సినిమా 'సైంధవ్'లోనూ ఆమె నటించింది.

4 / 5
అయితే తాజాగా బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధా శ్రీనాథ్. బాలకృష్ణ సినిమా కాకుండా విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమాలోనూ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఆ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 / 5

ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఇక ఈ మూవీకు కొనసాగింపుగా ‘జైలర్‌ 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లో శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించేందుకు సెలెక్ట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించగా, ఇప్పుడు తాజగా ‘జైలర్‌ 2’లో శ్రద్దా శ్రీనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినపడుతుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది.