
ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూడాల్సిన అవసరం ఇక లేదు... ఎన్టీఆర్ - నీల్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అత్యంత భారీగా అట్టహాసంగా మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి.

RFCలో దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్. తారక్ కొన్ని రోజుల తర్వాత సెట్స్‌లో జాయిన్ అవుతారు. ఈలోపు ఆయన లేని కొన్ని సీన్స్ చిత్రీకరించాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో యాక్షన్‌లో సరికొత్త వేవ్‌ని చూపించడానికి సిద్ధమయ్యారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. మాస్‌లో ఆ యుఫోరియా క్రియేట్ చేయడానికి రెడీ అంటూ సిగ్నల్స్ పంపేశారు చిత్ర బృందం.

అల్లర్లు, అల్ల కల్లోలాల మధ్య జనాలను పోలీసులు కట్టడి చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు అఫిషియల్ ఫొటో చెప్పకనే చెప్పేసింది. తారక్‌కి నెక్స్ట్ రేంజ్ సినిమా గ్యారంటీ అనే జోష్ క్రియేట్ అయింది ఫ్యాన్స్ లో.

ఈ సినిమా కోసం ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ చేసేశారు నీల్. మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది సినిమా అని ధీమా కనిపిస్తోంది నీల్‌లో. ప్రస్తుతం వార్2 సెట్స్ లో ఉన్నారు తారక్. అది పూర్తయ్యాకే ఈ సెట్స్ కి హాజరవుతారు.