
శోభా శెట్టి.. కానీ బుల్లితెర ప్రేక్షకులకు మోనితగానే పరిచయం. కార్తీక్ దీపం సీరియల్ ద్వారా తెలుగు సినీప్రియులకు దగ్గరయ్యింది. కన్నడలో పలు సినిమాలు, సీరియల్లలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది.

కానీ ఈ షో ద్వారా పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శోభా శెట్టి మరో సీరియల్ చేయలేదు. కానీ నెట్టింట మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. ట్రెడిషనల్ చీరకట్టులో మెస్మరైజ్ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు తాజాగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసింది. సొంతం డిజైనర్ స్టూడియో ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. నిత్యం ఫ్యాషన్ ప్రపంచంలో ఏదోక బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్న శోభా శెట్టి.. ఇప్పుడు సొంతంగా డిజైనర్ స్టూడియోను స్టార్ట్ చేసింది.

అలాగే నెట్టింట చీరకట్టులో మరింత అందంగా ముస్తాబై ఫోటోషూట్స్ చేసింది. తాజాగా ఈ ముద్దగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మరోవైపు మోడ్రన్ డ్రెస్సులలోనూ గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది శోభా.

శోభా శెట్టి.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొత్తగా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. గతంలో తన ప్రియుడితో కలిసి కొత్త ఇల్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం అతడితో నిశ్చితార్థం సైతం జరిగింది.