
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సతీమణగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గౌరీఖాన్. నిర్మాతగా, ఇంటీరీయర్ డిజైనర్‌గా వ్యాపార రంగంలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతుందామె. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూనే ఇంటీరియర్ డిజైనర్‌గానూ రాణిస్తుందామె. మరి గౌరీఖాన్ ఆస్తుల వివరాలపై ఒక లుక్కేద్దాం రండి.

గౌరీ ఖాన్ నిర్మాతగా 2002లో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని ప్రారంభించారు. గౌరీ ఖాన్, షారుక్ ఖాన్ కలిసి 20కి పైగా చిత్రాలను నిర్మించారు. ఇక గౌరీ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ కూడా.

కింగ్ ఖాన్ భార్యకు జుహులో 'గౌరీ ఖాన్ డిజైన్స్ స్టూడియో' ఉంది. గౌరీ ఖాన్ ఇప్పటివరకు చాలా మంది సెలబ్రిటీల ఇళ్లను డిజైన్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నుండి దర్శకుడు కరణ్ జోహార్ వరు పలు సెలబ్రిటీల ఇళ్ల ఇంటీరియర్‌ని గౌరీ ఖానే డిజైన్ చేయడం విశేషం.

షారుఖ్ ఖాన్ భార్యకు ముంబైలో ఓ లగ్జరీ హోటల్ కూడా ఉంది. ఆ హోటల్ పేరు 'అర్థ'. ఈ హోటల్‌ను గౌరీ ఖాన్ స్వయంగా డిజైన్ చేసింది. గౌరి తన వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం, గౌరీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ. 1,725 కోట్లు.

ఇక నటి కాకపోయినా సోషల్ మీడియాలో గౌరీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కాగా షారుక్ బాటలోనే తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా నడవనున్నాడు. ఓ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే హీరోగా కాదు డైరెక్టర్‌గా. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.