Jawan Movie: షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి వరకు.. ఒక్కొక్కరి ఆస్తి విలువ ఎంతో తెలుసా..

|

Sep 07, 2023 | 10:08 PM

తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం జవాన్. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఒక్కొక్కరికి భారీగానే పారితోషికం అందించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నటించిన స్టార్ నటీనటుల ఆస్తి వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. షారుఖ్ నుంచి విజయ్ సేతుపతి, నయనతార, దీపిక పదుకొణె వరకు ఒక్కొక్కరి ఆస్తి వివరాలు తెలుసుకుందామా.

1 / 7
షారుఖ్ ఖాన్..  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఇండియాలోని సంపన్న హీరోలలో ఒకరు.  ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన షారుఖ్ మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.6,300 కోట్లు.

2 / 7
నయనతార..  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి అలరించింది. ఇప్పుడు జవాన్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఇప్పటివరకు నయన్ రూ.200 కోట్లకు పైగా సంపాదించింది.

3 / 7
డైరెక్టర్ అట్లీ..  కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో అట్లీ ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు జవాన్ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. అట్లీ ఆస్తి విలువ దాదాపు రూ. 37.5 కోట్లు.

4 / 7
దీపికా పదుకొణె..  బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొణె  స్టార్ హీరోయిన్. సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అగ్రకథానాయికగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు దీపికా దాదాపు రూ.500 కోట్లకు పైగా ఆస్తులు జమ చేసింది.

5 / 7
విజయ్ సేతుపతి..  సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడ జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో విజయ్ నటించాలని షారుఖ్ బలంగా కోరుకున్నాడు. అంతేకాదు విజయ్ ను  ఈ సినిమాకు ఒప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. విజయ్ ఆస్తి విలువ దాదాపు రూ. 140 కోట్లు.

6 / 7
ప్రియమణి..  ఇటు తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది ప్రియమణి. గతంలో షారుఖ్, దీపికా నటించిన చెన్నై  ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు జవాన్ చిత్రంలో కీలకపాత్రలో నటించింది. ఇప్పటివరకు ప్రియమణి దాదాపు రూ.57.9 కోట్లు జమ చేసింది.

7 / 7
అనిరుధ్ రవిచందర్..  కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఓ వైపు తెలుగులో ఎన్నో చిత్రాలకు సంగీతం అందిస్తున్న అనిరుధ్.. ఇప్పుడు జవాన్ చిత్రానికి అందించారు. అనిరుధ్ ఇప్పటివరకు రూ. 50 కోట్లు ఆస్తి కలిగి ఉన్నాడు.