Shahrukh Khan: బాలీవుడ్ రాజ్యాన్ని కాపాడటానికి మళ్లీ షారుక్ ఖాన్ రావాల్సిందేనా..?

| Edited By: Prudvi Battula

Nov 19, 2023 | 9:28 AM

కొన్నిసార్లు రాజ్యాన్ని కాపాడుకోడానికి రాజే సైనికుడిగా వస్తాడు.. సాహో సినిమాలో డైలాగ్ ఇది. పోలిక కాస్త ఓవర్‌గా అనిపించినా.. షారుక్ ఖాన్‌ను చూసాక అదే అనిపిస్తుందిప్పుడు. ఆయన చేస్తున్న సినిమాలు.. వస్తున్న కలెక్షన్లు.. వాటి రెస్పాన్స్ చూసాక బాలీవుడ్ అంతా ఇప్పుడు షారుక్‌తోనే నడుస్తుందేమో అనిపించక మానదు. ఐదేళ్లకు పైగానే సినిమాలకు దూరంగా ఉండి.. పదేళ్ళ నుంచి బ్లాక్‌బస్టర్ లేని కింగ్ ఖాన్.. పఠాన్‌తో విశ్వరూపం చూపించాడు.

1 / 5
ఐదేళ్లకు పైగానే సినిమాలకు దూరంగా ఉండి.. పదేళ్ళ నుంచి బ్లాక్‌బస్టర్ లేని కింగ్ ఖాన్.. పఠాన్‌తో విశ్వరూపం చూపించాడు. ఏకంగా 1000 కోట్లు వసూలు చేసాడు. ఆ తర్వాత వచ్చిన జవాన్ కూడా అంతే. పట్టు తప్పిన బాలీవుడ్‌ను ట్రాక్ ఎక్కించడానికి పఠాన్‌, జవాన్‌తో వచ్చినట్లుంది కింగ్ ఖాన్. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులతో విందు భోజనం పెట్టాడు ఈ హీరో. బోనస్‌గా రెండు సినిమాల్లోనూ అక్కడక్కడా మంచి దేశభక్తి సన్నివేశాలు కూడా పడ్డాయి. దాంతో రెండూ 1000 కోట్లు దాటేసాయి. అయితే కేవలం షారుక్ సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం.. మిగిలిన హీరోలకు రాకపోవడంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి.

2 / 5
పఠాన్ తర్వాత భారీ సినిమాలు చాలానే విడుదలయ్యాయి కానీ దేనికి కనీసం 500 కోట్లు కూడా రాలేదు. సల్మాన్ ఖాన్ సమ్మర్‌లో కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌తో వచ్చాడు. ఆ సినిమా 200 కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్ అయింది. మరోవైపు రణ్‌బీర్ కపూర్, రన్వీర్ సింగ్ లాంటి హీరోలు వచ్చినా 200 నుంచి 300 కోట్ల మధ్యలో ఆగిపోతున్నారు. గదర్ 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 600 కోట్లు వసూలు చేసింది.

3 / 5
తాజాగా విడుదలైన సల్మాన్ ఖాన్ టైగర్ 3 బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గించేసింది. మూడు రోజులు కూడా 200 కోట్ల వరకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా సండే రిలీజ్ చేయడం ఓ మైనస్ అయితే.. వీక్ డేస్ మొదలయ్యాక వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచులు ఉండటం మరో మైనస్ అయింది. నవంబర్ 19 కూడా ఫైనల్ ఉండటం.. అందులో ఇండియా ఆడుతుండటంతో టైగర్ 3కి మరో దెబ్బ తప్పదు.

4 / 5
మనీష్ శర్మ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన టైగర్ 3 కచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తుందని సల్మాన్ ఫ్యాన్స్ తెగ ఊగిపోయారు. కానీ వాళ్ల ఆశలు మామూలుగా గండి కొట్టట్లేదు ఈ సినిమా. చూస్తుంటే 400 కోట్లు కూడా కష్టమే అనిపిస్తుంది. ఈ క్రమంలోనే 1000 కోట్లు కొట్టడం కేవలం షారుక్ ఖాన్‌కు మాత్రమే సాధ్యమంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సల్మాన్‌పై ట్రోలింగ్ మొదలు పెట్టారు.

5 / 5
డిసెంబర్ 22న డంకీ విడుదల కానుంది. రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఎదురుగా సలార్ పోటీకి వస్తున్నా.. కింగ్ ఖాన్ ఫాలోయింగ్ వేరు. ఓవర్సీస్‌లోనూ దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఒకవేళ షారుక్ కానీ డంకీ సినిమాతో మరోసారి 1000 కోట్లు అందుకున్నాడంటే మాత్రం మిగిలిన హీరోలకు అంతకంటే అవమానం మరోటి ఉండదేమో..?