ట్రెండ్ మార్చిన సీనియర్ హీరోలు.. మార్పు వెనక అసలు కారణమేంటి ??

| Edited By: Phani CH

Dec 09, 2023 | 1:10 PM

సీనియర్ హీరోల ఆలోచన శైలి మారిపోతుందా..? ఒకప్పట్లా రెగ్యులర్ కమర్షియల్ కథలు కావాలని కోరుకోవట్లేదా...? ఏజ్‌కు రెస్పెక్ట్ ఇస్తూ.. ఎంచక్కా రజినీకాంత్, కమల్ హాసన్‌ను ఫాలో అవుతున్నారా..? లేదంటే ట్రెండ్ ఇదే అని అదే దారిలో అంతా వెళ్తున్నారా..? ఒక్కరో ఇద్దరో కాకుండా.. సీనియర్ హీరోలందరిలోనూ మార్పు కనిపించడం వెనక అసలు కారణమేంటి..? అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో..? చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు అలవాటు పడిపోయి.. ఉన్నట్లుండి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే.

1 / 5
సీనియర్ హీరోల ఆలోచన శైలి మారిపోతుందా..? ఒకప్పట్లా రెగ్యులర్ కమర్షియల్ కథలు కావాలని కోరుకోవట్లేదా...? ఏజ్‌కు రెస్పెక్ట్ ఇస్తూ.. ఎంచక్కా రజినీకాంత్, కమల్ హాసన్‌ను ఫాలో అవుతున్నారా..? లేదంటే ట్రెండ్ ఇదే అని అదే దారిలో అంతా వెళ్తున్నారా..? ఒక్కరో ఇద్దరో కాకుండా.. సీనియర్ హీరోలందరిలోనూ మార్పు కనిపించడం వెనక అసలు కారణమేంటి..? అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో..?

2 / 5
చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు అలవాటు పడిపోయి.. ఉన్నట్లుండి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే. కానీ వయసు పెరుగుతుంది కదా తప్పదు.. ఇప్పటికీ హీరోయిన్ల వెనక పడి డ్యూయెట్స్ పాడతాం అంటే ఆడియన్స్ అప్‌డేట్ అయ్యారు కాబట్టి ఒప్పుకోవట్లేదు. అందుకే రజినీ, కమల్ రూట్ మార్చారు.. విక్రమ్, జైలర్‌తో రికార్డులు కొట్టారు. ఇప్పుడిక మన హీరోల వంతు.

3 / 5
మన హీరోలలోనూ మార్పు మెల్లగా మొదలైంది. దానికి బాలయ్యే ఆద్యుడు. ఈ మధ్య ఆయన ఎంచుకుంటున్న కథల్లో ఏజ్‌కు రెస్పెక్ట్ కనిపిస్తుంది. అఖండలో హీరోయిన్ లేకుండా.. సీరియస్ పాత్రలో కనిపించారు. వీరసింహారెడ్డిలో శృతి హాసన్ ఉన్నా రొమాన్స్‌కు పెద్దగా స్కోప్ ఉండదు.. మొన్న భగవంత్ కేసరిలోనూ కాజల్ ఉన్నా జస్ట్ అలా పేరుకే. పైగా ఇందులో శ్రీలీలకు తండ్రిగా నటించారు.

4 / 5
బాలయ్య ఇమేజ్ వాడుకుంటూ ఈ పాత్రను కొత్తగా డిజైన్ చేసారు అనిల్ రావిపూడి. ఇప్పుడు బాబీ సినిమాలోనూ బాలయ్య ఏజ్డ్ పాత్రలోనే నటిస్తున్నట్లు తెలుస్తుంది. కుర్ర పాత్ర కూడా ఉన్నా.. ఫోకస్ అంతా ఏజ్డ్ పాత్రపైనే పెడుతున్నారు బాబీ. 6 పాటలు, 3 కామెడీ సీన్స్ టైప్ ఆఫ్ కథలు వద్దంటున్నారు సీనియర్స్. వెంకటేష్ సైంధవ్ కూడా అలాంటి కథే. ఇందులో చైల్డ్ సెంటిమెంట్ బలంగా ఉండబోతుంది.

5 / 5
మన్మథుడు ఇమేజ్ ఉన్న నాగార్జున కూడా ఈ మధ్య వయసుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఘోస్ట్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలొచ్చాయి. మధ్యలో బంగార్రాజు వచ్చినా.. తాజాగా నా సామిరంగాలోనూ ఏజ్డ్ పాత్రే చేస్తున్నారు. చిరంజీవి సైతం వశిష్ట కోసం సోషియో ఫాంటసీ చేస్తున్నారు. దీనికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి మెల్లగా మన హీరోల్లో మార్పు మొదలైంది.