
యానిమల్ సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు మూవీ గోయర్స్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా మూవీ. ఆ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లన్నీ కంప్లీట్ చేసేశాక, ఇంకేం చేయడం లేదు సందీప్.

జస్ట్ ప్రభాస్ స్పిరిట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. యానిమల్ 2 గురించి ఎవరైనా అడిగినా.. ఆఫ్టర్ స్పిరిట్ అనే అంటున్నారు. ప్రభాస్ వరుసగా షూటింగ్ చేస్తున్నట్టే ఉన్నా.. సెట్స్ మీద ఇన్ని సినిమాలుండేసరికి, దేనికి ఎన్నాళ్లు కేటాయిస్తున్నారో తెలియని పరిస్థితి.

ప్రస్తుతం ఫౌజీ షూట్‌లో బిజీగా ఉన్నారు డార్లింగ్. రాజా సాబ్ రిలీజ్ డేట్ సంగతేంటి సారూ అని అడిగేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఆఖరున కల్కి సీక్వెల్‌ని స్టార్ట్ చేస్తామని చెప్పారు నాగ్ అశ్విన్.

సో, అప్పటి లోపు సలార్ సీక్వెల్ కంప్లీట్ అవుతుందా? అంటే అయ్యే పరిస్థితి లేదు. సలార్ శౌర్యాంగపర్వం సెట్స్ మీదకు వెళ్లాలంటే, కల్కి సెకండ్ చాప్టర్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.

డార్లింగ్ ఇన్ని పనులూ పూర్తి చేసుకుని వచ్చేవరకు సందీప్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? పనిలో పని యానిమల్2 స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తే, సైమల్‌టైనియస్‌గా రెండు ప్రాజెక్టుల్నీ కానిచ్చేయొచ్చుగా అని సలహాలిచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇంతకీ సందీప్ మనసులో ఏం ఉంది?