
అర్జున్ రెడ్డి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆ సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి నార్త్ ఇండస్ట్రీలోనూ అదే రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ముఖ్యంగా రివ్యూవర్ల విషయంలో సందీప్ చేసిన కామెంట్స్, బాలీవుడ్‌కి షాక్ ఇచ్చాయి. యానిమల్ సినిమా విషయంలోనూ తన యాటిట్యూడ్‌ను కంటిన్యూ చేశారు సందీప్.

ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిణితి చోప్రాను తీసుకున్నారు. కొద్ది రోజుల షూటింగ్ తరువాత ఆమె ఆ క్యారెక్టర్‌కు సూట్ కాలేదంటూ... స్టార్ కిడ్ అని కూడా చూడకుండా పరిణితిని పక్కన పెట్టి రష్మికకు ఛాన్స్ ఇచ్చారు.

ఇప్పుడు స్పిరిట్ విషయంలో అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు సందీప్. ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికను తీసుకోవాలని భావించినా.. ఆమె పెట్టి డిమాండ్స్‌కు నో చెప్పేశారు.

దీపికను కాదని, డార్లింగ్‌కు జోడీగా కొత్త అమ్మాయిని తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. సందీప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు నార్త్ సర్కిల్స్‌లో హట్ టాపిక్ అవుతున్నాయి.