
హీరోయిన్ సమంత.. రీసెంట్‌గా అమెరికా వెళ్లింది. నార్మల్‌గా అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత కొన్నాళ్ల నుంచి ఓ అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతోంది.

దీంతో ఈ టూర్.. చికిత్స కోసమే అని రకరకాల రూమర్స్ వచ్చాయి. మరి ఈ ప్రయాణం వెనక అసలు విషయం ఇప్పుడు తెలిసిపోయింది. ఫొటోలు, వీడియోలు బయటపడటంతో అసలు విషయం బయటపడింది.

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయర్క్‌లో 'ఇండియా డే పరేడ్' వేడుకల్ని నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఇవి గ్రాండ్‌గా జరిగాయి.

ఇందులోనే హీరోయిన్ సమంత పాల్గొంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సామ్ తోపాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ వేడుకలకు అటెండ్ అయ్యారు.

'ఈ రోజు న్యూయార్క్ లో ఉండటం చాలా గర్వంగా ఉంది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవి నేను చూసిన దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయి.

ఈ మూమెంట్స్ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ అరుదైన గౌరవం దక్కినందుకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను.

నా మూవీస్ ఆదరిస్తున్న అమెరికన్ ప్రజలకు ధన్యవాదాలు' అని సమంత చెప్పింది. 'ఇండియా డే పరేడ్' వేడుకల్లో సమంత కంటే ముందు అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన తదితరులు పాల్గొన్నారు.