
యానిమల్, పుష్ప 2, ఛావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్.. ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న. ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు.

ఈమె అడుగు పెట్టిన సినిమా బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాలన్నీ తారుమారు చేసింది.

సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమాకు మొదటి రోజే టాక్ తేడాగా వచ్చింది.. ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా లేవు. కేవలం 30 కోట్లతో సరిపెట్టుకున్నారు సల్మాన్.

ఇక రష్మిక పాత్ర విషయానికి వస్తే.. అరగంటకు అటూ ఇటూగా ఉండే పాత్రతో సరిపెట్టేసారు మురుగదాస్. లేదనకుండా 2 పాటల్లో కనిపించారు ఈ బ్యూటీ. సికిందర్‌లో రష్మిక మందన్న పాత్ర అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదనేది ఆమె ఫ్యాన్స్ చెప్తున్న మాట.

టాక్ చూస్తుంటే.. వీకెండ్ వరకు పర్లేదేమో గానీ తర్వాత భాయ్ సినిమాకు బ్రేకులు పడటమైతే ఖాయం. ఇదే జరిగితే వరస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక జోరుకు కూడా బ్రేకులు పడినట్లే. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో తామా సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ.