
హిందీ చిత్రసీమలో సల్మాన్ ఖాన్‌కు మంచి డిమాండ్ ఉంది. ఆయన బాలీవడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బిగ్ బాస్ వంటి ప్రముఖ టీవీషోల్లోనూ మెరుస్తున్నాడు. ఈ కారణంగానే సల్మాన్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

అయితే ఇటీవల తన సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఖాన్ బాగా కలత చెందాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాబాను హత్య చేసినట్లు అధికారికంగా ప్రకటించుకుంది.

కాగా సల్మాన్ ఖాన్ చేతికి ఎప్పుడూ బ్రాస్లెట్ ఉంటుంది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగానే ఆయన దానిని ధరిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల ప్రతికూల అంశాలు తొలగిపోతాయని సల్మాన్ నమ్ముతున్నాడట.

సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ డిస్ట్రబ్ అవుతున్నాయి.

తప్పని సరి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోకు కూడా బ్రేక్ ఇచ్చారు భాయ్‌జాన్. హిందీ బిగ్ బాస్ మొదలైన దగ్గర నుంచి వరుసగా 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్.