
శ్రియ రెడ్డి టెలివిజన్ ప్రెజెంటర్, వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టింది. ఈ చిన్నది ప్రధానంగా తమిళం, తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఆమె తండ్రి మాజీ భారత టెస్ట్ క్రికెటర్ భరత్ రెడ్డి. చెన్నైలోని గుడ్ షెపర్డ్ స్కూల్‌లో చదువుకుని, ఆ తర్వాత ఎతిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.

చిన్నప్పుడు క్రికెటర్లు రవి శాస్త్రి మరియు సందీప్ పాటిల్ ఆమె స్వరాన్ని ప్రశంసించారు, అది ఆమెకు ప్రేరణగా నిలిచింది. దాంతో శ్రియ తన కెరీర్‌ను SS మ్యూజిక్‌లో వీడియో జాకీగా ప్రారంభించింది, అక్కడ ఆమె "కనెక్ట్", "ఫోన్‌టాస్టిక్" వంటి షోలను హోస్ట్ చేసింది.

2002లో "సమురాయ్" అనే తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగులో "అప్పుడప్పుడు" (2003), మలయాళంలో "బ్లాక్" (2004), తమిళంలో "తిమిరు" (2006) ,"కంచివరం" (2008) వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల "సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్" (2023)లో రాధా రామ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

2008లో ఆమె నటుడు, నిర్మాత విక్రమ్ కృష్ణను వివాహం చేసుకుంది. విక్రమ్ కృష్ణ నటుడు విశాల్ సోదరుడు. వారు కలిసి GK ఫిల్మ్స్ కార్పొరేషన్ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. వివాహం తర్వాత ఆమె కొంతకాలం నటనకు విరామం ఇచ్చినప్పటికీ, "అండావ కానోం" తో తిరిగి సినిమాల్లోకి వచ్చింది. శ్రియ తన విలక్షణమైన నటన , స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో "OG" అనే చిత్రంలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. తన అందాలతో ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది.