గార్గి సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి. అయితే ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకునే ఆమెకు ఈ గ్యాప్ బాగానే ఉపయోగపడింది. ప్రస్తుతం సాయి పల్లవికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం శివకార్తికేయన్‌తో కలిసి ఓ క్రేజీ మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా ఈ సినిమాతో మరో భారీ ప్రాజెక్టులోనూ సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టులో ఆమె సీత పాత్రకు ఎంపికైంది.
తాజాగా ఈ వార్తలపై స్పందించింది సాయి పల్లవి. ఇది కచ్చితంగా తనకు సవాల్‌తో కూడిన పాత్ర అని చెప్పుకొచ్చిన ఆమె కథ వినేందుకు త్వరలోనే ముంబై వెళుతున్నానంది.
రామాయణం సినిమాలో నటించడం తన అదృష్టమని, ఇందులో పలువురు ప్రముఖులు నటిస్తున్నారని, వారిలో 10 శాతం నేను నటించినా చాలని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సో.. రామాయణంలో న్యాచురల్ బ్యూటీ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.