
పాయల్ రాజ్ పుత్.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది అందల భామ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఈ అమ్మడు తన అందాలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్ రాజ్ పుత్. దాంతో కుర్రకారు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది పాయల్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెరిసింది ఈ వయ్యారి భామ. అలాగే బడా హీరోల సరసన కూడా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా క్లిక్ అవ్వలేక పోయింది పాయిల్.

రవితేజకు జోడిగా డిస్కో రాజా, వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలు చేసింది. కానీ ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ అమ్మడు రేస్ లో వెనుకబడిపోయింది. చాలా రోజుల తర్వాత మంగళవారం అనే సినిమాతో హిట్ అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ భామకు ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ దర్శకనిర్మాతల ఆకర్షిస్తుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుతోంది ఈ వయ్యారి భామ.