
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి రోజు రోజుకీ ఆనందం పెరిగిపోతోంది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ఖుషీ ఈ ఏడాది కంటిన్యూ అవుతుందనే భరోసా కనిపిస్తోంది.

ఒకటి కాదు, రెండు కాదు, మూడు సినిమాలతో రౌడీ హీరో పలకరించడానికి రెడీ అవుతున్నారనే మాట ఉత్సాహం నింపుతోంది వీడీ ఫ్యాన్స్ లో.! కశ్మీర్‌లో తనకు నచ్చిన బేగమ్‌ని చూసుకుని, హ్యాపీగా బాక్సాఫీస్ దగ్గర బంపర్ బోనాంజా టేస్ట్ చేశారు విజయ్ దేవరకొండ.

అంతకు ముందు పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో చేసిన లైగర్ ఫెయిల్యూర్‌ని ఖుషీ సక్సెస్‌తో బ్యాలన్స్ చేసేశారు విజయ్ దేవరకొండ. ప్రాణం పెట్టి చేసిన సినిమా జనాలకు నచ్చకపోతే ఎనర్జీ లెవల్స్ తగ్గడం మామూలేనని అంటారు సిల్వర్‌స్క్రీన్ అర్జున్‌రెడ్డి.

కానీ, ఓ మంచి విజయం గతాన్ని మరిపించేలా చేస్తుందని నమ్ముతారు మిస్టర్ దేవరకొండ. ప్రస్తుతం తన సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీ జోనర్‌గా ఫ్యామిలీస్టార్ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.

ఈ ఏడాది ఫస్టాఫ్‌లో పలకరించడానికి రెడీ అవుతోంది ఫ్యామిలీస్టార్. అటు ఫక్తు యాక్షన్ డ్రామాగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే సినిమా కూడా ఈ ఏడాదే జనాలను ముందుకు రానుంది.

ఒక ఫ్యామిలీ సినిమా, ఒక యాక్షన్ సినిమా అని శాటిస్‌ఫై అయిన రౌడీ మీరో ఫ్యాన్స్ కీ, కల్కి రూపంలో మరో ఫ్యూచరిస్టిక్ సినిమా కూడా బోనస్‌గా ఉండొచ్చనే మాటలు వైరల్ అవుతున్నాయి.

నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో స్పెషల్ రోల్స్ చేయడం విజయ్ దేవరకొండకి కొత్తేం కాదు కాబట్టి, ఈ మాటకు గట్టి బలం చూకూరుతోంది. సో 2024లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మూడు సినిమాలతో విందుభోజనం రెడీ అవుతుందన్నమాట.