
ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. ఇప్పుడు హీరోయిన్ లా మారిపోయింది. తెలుగు, మలయాళం భాషలలో పలు సినిమాల్లో తన అమాయకత్వం.. సహజ నటనతో కట్టిపడేసింది. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఎస్తర్ అనిల్. వెంకటేశ్, మీనా కలిసి నటించిన దృశ్యం సినిమాలో నటించింది. ఇందులో వెంకీ చిన్న కూతురిగా కనిపించింది. మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తర్వాత చదువుపై దృష్టి పెట్టింది. ఇటీవలే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేయగా.. నెటిజన్స్ కంగ్రాట్స్ చెప్పారు. ఇప్పుడు తాజాగా లేటేస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది.

బ్లాక్ డ్రెస్ లో సింపుల్ లుక్స్ తో ఎస్తేర్ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో హీరోయిన్లకు మంచిన అందంతో ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి తిరిగి రీఎంట్రీ ఇస్తున్న ఎస్తేర్.. సరైన అవకాశం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. కేరళకు చెందిన ఈ అమ్మడు.. చైల్డ్ ఆర్టిస్టుగానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. జోహార్, దృశ్యం సినిమాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.