
రెజీనా కాసాండ్రా.. సుధీర్ బాబు నటించిన శివ మనస్సులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది అందాల ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.

ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రెజీనా అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది ఈ అమ్మడు. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

తెలుగుతో పటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అందాల భామ. తెలుగులో ఈ అమ్మడు 14 సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి అదరగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో దుమ్మురేపింది రెజీనా కాసాండ్రా. హిందీలోనూ ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది, కేసరి చాప్టర్ 2, జాట్ సినిమాలో కనిపించింది ఈ వయ్యారి భామ.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. దాంతో ఈ బ్యూటీ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.