
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ మాస్ జాతార నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్.

వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఈ రిలీజ్ ప్లాన్ చేశారు. సింగిల్, సామజవరగమనా లాంటి సూపర్ హిట్ సినిమాలకు మాటలు అందించిన భాను భోగవరపు 'మాస్ జాతర' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ధమాక సినిమాతో రవితేజకు బెస్ట్ జోడీ అనిపించుకున్న శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి మాస్ మహరాజ్‌తో జోడీ కట్టారు.

మరో వైపు కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్స్ కూడా జట్ స్పీడుతో జరుగుతున్నాయి. వరుసగా కౌంట్‌డౌన్ పోస్టర్లతో సందడి చేస్తోంది యూనిట్.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.