
టాలీవుడ్ బ్యూటీ రష్మిక గురిచి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా దూసుకెళ్తుంది. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, గీతా గోవిందం మూవీతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మూవీతో ఈ అమ్మడుకు లక్కు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, తన అంద చందాలతో, నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.

ఇక ఏడాది ఈ ముద్దుగుమ్మ ఏకంగా 5 సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఈ బ్యూటీ తన హవా కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక 2025 జ్ఞాపకాలను, ఈ సంత్సరంలోని స్పెషల్ ఫొటోస్, తాను చేసిన సినిమాలకు సంబంధిచిన పోస్టర్స్ ఇన్ స్టాలో షేర్ చేసింది.

అలాగే రష్మిక గత కొన్ని రోజుల నుంచి విజయ్ దేవరకొండతో లవ్ లో ఉన్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాను షక్ చేశాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 2025లో విజయ్‌తో ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చింది.ఇక 2026 లో వీరిద్దరు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. అలా 2025 సంవత్సరంలోనే ఈ ముద్దుగుమ్మ వివాహ బంధంలోకి మొదటి అడుగు వేసింది.

అంతే కాకుండా 2025లో రష్మిక సినిమాల పరంగా సక్సెస్ అయ్యింది, అలాగే లవ్, పెళ్లిగా మారింది, అంతే కాకుండా స్నేహితులతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ, ఇలా అన్నివిధాల 2025 ఈ బ్యూటీకి కలిసి వచ్చిందనే చెప్పాలి.

ఇక న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక గత సంవత్సరపు తీపి జ్ఞాపకాలను పంచుకుంది. తనకు ఇష్టమైన కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తన చెల్లితో దిగిన ఫొటో షేర్ చేయడంతో, న్యూ ఇయర్ స్పెషల్ పిక్ ఇదే, అంటున్నారు ఈ అమ్మడు అభిమానులు.