
దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద కొనసాగుతున్నా... స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశీఖన్నా.

అందుకే.. ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు. వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ బ్యూటీ... సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్‌తో హల్ చల్ చేస్తున్నారు.

గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా ఈ మధ్య టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించటమే మానేశారు. బాలీవుడ్‌లో ఒకటి రెండు ప్రాజెక్ట్స్‌లో రాశీ పేరు వినిపిస్తున్నా... లీడ్ హీరోయిన్‌గా మాత్రం కాదు.

దీంతో ఈ బ్యూటీ ఐడెంటిటీ కోసం సెర్చ్ లైట్స్ వేసి వెతుకుతున్నారు ఫ్యాన్స్. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేయర్ రెయిజ్ చేస్తున్నారు రాశీ.

వరుస ఫోటో షూట్‌లతో హల్ చేస్తున్న రాశీ, ఇప్పుడు హాట్‌నెస్ ఓవర్ లోడెడ్ అన్న రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. మూవీ అప్‌డేట్స్‌తో న్యూస్‌లో కనిపించకపోయినా... గ్లామర్ అప్‌డేట్స్‌తో మాత్రం గట్టిగానే సందడి చేస్తున్నారు.

అయితే ఈ రేంజ్‌లో కష్టపడుతున్నా అనుకున్న రేంజ్‌లో ఆఫర్స్ అయితే రావటం లేదు. యంగ్ హీరోలు తప్ప స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు రాశీని అస్సలు పట్టించుకోవటం లేదు.

అందుకే తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి కోలీవుడ్, బాలీవుడ్‌లలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రజెంట్ అమ్మడి కిట్టీలో ఉన్న సినిమా లిస్ట్ చూస్తే ఇదే అనిపిస్తోంది.

రాశీ గ్లామర్ షో, వెండితెర అవకాశాలకు హెల్ప్ అవ్వకపోయినా... డిజిటల్ ఛాన్స్‌లకు మాత్రం గట్టిగానే హోల్ప్ అవుతోంది.

అజయ్ దేవగన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన 'రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్'లో నెగెటివ్ రోల్‌లో నటించిన రాశీ... రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫర్జీలోనూ ఇంట్రస్టింగ్ రోల్ ప్లే చేశారు. మరికొన్ని నార్త్ ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.