
అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయింది.

అంతకు ముందుకు మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

స్టార్ హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తుంది ఈ వయ్యారి భామ. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రాశి ఖన్నా. అంతే కాదు హిందీలోనూ వెబ్ సిరీస్ లలో నటించింది.

హిందీలో రుద్ర, ఫర్జి సినిమాల్లో నటించి మెప్పించింది రాశిఖన్నా. తాజాగా ఈ అమ్మడు మొక్కలు నాటుతూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.