
ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఈరోజు (సెప్టెంబర్ 28) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సావరియా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రణ్‌బీర్. అనతికాలంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

రిషి కపూర్- నీతూ దంపతులకు జన్మించాడు రణబీర్ . 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన 'సావరియా' రణబీర్ కపూర్ తొలి చిత్రం. హీరో కాకముందు రణబీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

సావరియా' తర్వాత రణబీర్ కపూర్ 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ', 'యే జవానీ హై దీవానీ', 'రాక్ స్టార్', బర్ఫీ, 'సంజు' , 'యే దిల్ హై ముష్కిల్' 'బ్రహ్మాస్త్ర' వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం 'యానిమల్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.

రణ్‌బీర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది. రష్మిక మందన్నఈ సినిమాలో కథానాయిక. అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయిన సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కాగా రణబీర్ ఒక్కో సినిమాకు 50 కోట్లు తీసుకుంటాడు. చాలా బ్రాండ్‌లకు ప్రచార అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. రణబీర్ కపూర్ మొత్తం ఆస్తులు 345 కోట్ల రూపాయలు. రణబీర్ కపూర్‌కు సినిమాలతో పాటు ఫుట్‌బాల్‌పై కూడా చాలా ఆసక్తి ఉంది. అతను ముంబై ఫుట్‌బాల్ క్లబ్ జట్టు సభ్యుడు కూడా.