Rambha: సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీని చూశారా? హీరోయిన్ లాంటి కూతురు.. ఫొటోస్ ఇదిగో

Updated on: Jun 05, 2025 | 7:56 AM

అలనాటి అందాల తార రంభ పుట్టిన రోజు ఇవాళ (జూన్ 05). పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోన్న రంభ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం రండి.

1 / 6
 తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్లలో రంభ ఒకరు. ఈ బ్యూటీ నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఆమె పేరు రంభ కావడంతో అదే స్థిరపడిపోయింది.

2 / 6
రంభ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, జగపతి బాబు, రాజ శేఖర్,సుమన్, జేడీ చక్రవర్తి  తదితర స్టార్ హీరోలతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

3 / 6
 తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది రంభ. 1992 నుంచి 2011 వరకు సినిమాల్లో నటించిన ఈ అందాల తార చివరి చిత్రం  ద ఫిలింస్టార్‌. ఈ మలయాళ సినిమా 2011లో విడుదలైంది.

4 / 6
 2010లో బిజినెస్‌మెన్‌ ఇంద్రకుమార్‌ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది రంభ. ప్రస్తుతం ఈ  అన్యోన్య దంపతులకు  ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం ఉన్నారు.

5 / 6
 కాగా రంభ పెద్ద కూతురు మాత్రం అందంగా మెరిసిపోతోందనే చెప్పాలి. అందంలో తల్లి రంభకే పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.  ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట  బాగా  వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ హీరోయిన్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

6 / 6
 కాగా చాలా మంది హీరోయిన్ల లాగే రంభ కూడా రీ ఎంట్రీ ఇస్తుందేమోనని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.  ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది.