
లైగర్ సినిమాతో నిరాశపరిచిన పూరి జగన్నాథ్ షార్ట్ గ్యాప్ తరువాత తన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌ను పట్టాలెక్కించారు. రామ్ హీరోగా సూపర్ హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారు.

అయితే షూటింగ్ స్టార్ట్ అయిన రోజే రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన పూరి. ఇప్పుడు అప్‌డేట్ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. లైగర్ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన పూరి, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.

దీంతో నెక్ట్స్ సినిమాతో టార్గెట్ మిస్ కాకూడదని గట్టిగా ఫిక్స్ అయిన డాషింగ్ డైరెక్టర్... హిట్ ఫార్ములాకు సీక్వెల్‌ను పట్టాలెక్కించారు. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో సూపర్ హిట్ అయిన సినిమా ఇస్మార్ట్ శంకర్.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పూరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. అందుకే అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. కాస్త ఆలస్యమైనా ప్రజెంట్ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే పనిలో ఉంది పూరి టీమ్.

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన రోజే మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు మేకర్స్. అంటే సరిగ్గా ఇంకో 30 రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావాలి. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో.

కానీ ఇంత వరకు ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేయలేదు టీమ్. పాన్ ఇండియా రిలీజ్ అంటే మినిమమ్ నెలన్నర ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వాలి. కానీ డబుల్ ఇస్మార్ట్ టీమ్ మాత్రం ఇంత వరకు ఆ ఊసే ఎత్తటం లేదు.

అసలు షూటింగ్ స్టేటస్ ఏంటన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. మరి ఇప్పటికైనా పూరి టీమ్ ప్రమోషన్స్ షురూ చేస్తుందేమో చూడాలి.