
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. తన అద్భుతమైన నటనతో అనతి కాలంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు చెర్రీ.

ఇప్పుడు రామ్ చరణ్ కు వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. అందుకే అతను ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే జరిగింది.

మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు సతీమణి ఉపాసనతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు రామ్ చరణ్. దీంతో రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు

ఈ సందర్భంగా మెల్ బోర్న్ లో భారత మువ్వన్నెల జెండాను ఎగుర వేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు చెర్రీ.