
జస్ట్ లోకేష్ మాత్రమే కాదు.. నెల్సన్ కూడా వా నువ్వు కావాలయ్యా అని అనడానికి సిద్ధమవుతున్నారు.

పూర్తిగా బ్లాక్ షేడ్స్.. వాటి మీద గోల్డ్ ఆర్టికల్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్స్.. యమాగా ఉంది టీజర్. ఇప్పుడు దాన్ని మించేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్.

కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ వస్తుంది. తాజాగా వెంకట్ ప్రభుతో రజినీ సినిమా ఓకే అయ్యేలా కనిపిస్తుంది.విజయ్‌తో ఈ మధ్యే గోట్ సినిమా చేసారు వెంకట్ ప్రభు. మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయినా.. తమిళంలో మాత్రం ఇరగదీసింది ఈ చిత్రం.

ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేసింది గోట్. తాజాగా రజినీకాంత్‌కు వెంకట్ ప్రభు ఓ కథ చెప్పినట్లు తెలుస్తుంది. గతేడాది కూడా విజయ్‌తో బీస్ట్ సినిమా చేసాక.. రజినీతో జైలర్ తెరకెక్కించారు దర్శకుడు నెల్సన్. బీస్ట్ ఫ్లాపైనా నెల్సన్‌పై నమ్మకంతో ఛాన్సిచ్చారు రజినీ.

ఆ నమ్మకాన్ని జైలర్‌తో నిలబెట్టుకున్నారు ఈ దర్శకుడు. ఇక విజయ్‌తో లియో సినిమా చేసిన లోకేష్ కనకరాజ్‌తోనే ప్రస్తుతం కూలీ చేస్తున్నారు రజినీ. మురుగదాస్‌కి కూడా ఇలాగే ఛాన్సిచ్చారు రజినీ. విజయ్‌తో సర్కార్ చేసాకే.. రజినీతో దర్బార్ చేసే అవకాశం వచ్చింది. మొత్తానికి విజయ్ డైరెక్టర్స్‌పై బాగానే ఫోకస్ చేసారు రజినీ.