Rajinikanth: తలైవర్‌ పక్కా ప్లాన్‌.. ఫెస్టివ్‌ సీజన్‌ ఆయనదేనా

| Edited By: Phani CH

Mar 21, 2025 | 8:30 PM

సక్సెస్‌ స్ట్రీక్‌ కంటిన్యూ అవుతుందనుకున్న టైమ్‌లో ఎక్కడా సడన్‌గా బ్రేక్‌ పడితే మనసు చివుక్కుమంటుంది. మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా? అనే నిరుత్సాహం వెంటాడుతుంది. దాన్ని లైట్‌గా దాటగలిగితే.. ఇక మనల్ని ఆపేదెవరంటూ దూసుకుపోవచ్చు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు రజనీకాంత్‌. ఇంతకీ ఏమైంది?

1 / 5

స్పీడోమీటర్‌ ఎవరికీ అందనంత స్పీడుగా తిరుగుతోందనుకుంటున్న టైమ్‌లో వేట్టయాన్‌ రిలీజ్‌ అయింది రజనీ కెరీర్లో. అనుకున్నంత హిట్‌ కాలేకపోయింది  ఈ సినిమా. 300 కోట్లు పెట్టి సినిమా చేస్తే, అంత మొత్తంలోనూ వసూలు రాలేదు.

2 / 5
కాస్త అది డిజప్పాయింట్‌ చేసినా.. వెంటనే తేరుకున్నారు రజనీకాంత్‌. కూలీ మూవీతో బిజీ బిజీ అయిపోయారు. కూలీ ప్రమోషనల్‌ కంటెంట్‌ని చూసిన వారు వింటేజ్‌ రజనీకాంత్‌ ఈజ్‌ బ్యాక్‌ అని అనుకున్నారు.

3 / 5
ఆల్రెడీ విక్రమ్‌తో కమల్‌కి సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమా ఇచ్చిన లోకేష్‌ కనగరాజ్‌ తలైవర్‌ కోసం పక్కా ప్రాజెక్టే రెడీ చేశారనే మాటలు వినిపించాయి. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్  చూసి మరింతగా స్క్రిప్ట్ షార్ప్ చేశారు లోకేష్‌.

4 / 5
కూలీ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దీపావళికి తలైవర్‌ గిఫ్ట్ ప్యాక్‌ రెడీ చేస్తున్నారనే మాటలు ఆల్రెడీ కోలీవుడ్‌లో వైరల్‌ అవుతున్నాయి.  ఓ వైపు ఆ పనులు చేస్తూనే, ఇప్పుడు జైలర్‌ సీక్వెల్‌లో నటిస్తున్నారు రజనీకాంత్‌.

5 / 5
తన ఏజ్‌కి తగ్గ కేరక్టర్‌, తనదైన స్టైల్‌లో భలే చేశారు రజనీకాంత్‌ అంటూ అన్నీ ఇండస్ట్రీల వారూ తల తిప్పి చూసేలా మెప్పించింది జైలర్‌ మూవీ. ఇప్పుడు ఈ సినిమాకు పర్ఫెక్ట్ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు నెల్సన్‌. ఫస్ట్ పార్టుతో పోలిస్తే, సెకండ్‌ పార్టు నెక్స్ల్ లెవల్‌లో ఉంటుందన్నది నెల్సన్‌ చెబుతున్న మాట.