
Rajamouli: హాలీవుడ్ దర్శకుల్లా తనక్కూడా పూర్తి యానిమేషన్ సినిమా చేయాలని ఉంది అని అన్నారు ఎస్. ఎస్. రాజమౌళి. భవిష్యత్తులో చేసే అవకాశం వచ్చినప్పుడు బాహుబలి సీరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు తనకు కచ్చితంగా ఉపయోగపడతాయని అన్నారు. ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా, అది కొత్త ఆడియన్స్ కి ఎలా చేరువవుతుందా అని ఆలోచిస్తానని చెప్పారు జక్కన్న.

Arya: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్య. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లయిన సందర్భంగా 'ఆర్యా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్' నిర్వహించుకున్నారు యూనిట్ సభ్యులు. హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ కలర్‌ఫుల్‌గా జరిగింది. యూనిట్ అంతా పాల్గొని తమ ఆనందాన్ని, ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

Aryan Khan: ఆర్యన్‌ఖాన్ తన డైరక్టోరియల్ డెబ్యూట్ ప్రాజెక్టును ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. స్టార్‌డమ్ అనే వెబ్‌సీరీస్ చేస్తున్నారు ఆర్యన్‌ఖాన్. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. గతేడాది జూన్‌లో స్టార్ట్ అయింది ఈ సీరీస్. ఇందులో షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్‌సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు నటిస్తున్నట్టు ముంబై టాక్.

Kesariya: మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ స్పాటిఫై వేదికగా రికార్డులు బద్ధలు కొట్టింది బ్రహ్మాస్త్ర సినిమాలోని కేసరియా సాంగ్. ఈ ప్లాట్‌ఫార్మ్ లో 500 మిలియన్ల స్ట్రీమింగ్ దాటిన తొలి పాటగా రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లోనూ మంచి రికార్డుల్ని క్రియేట్ చేసింది ఈ పాట. రణ్‌బీర్ కపూర్, ఆలియా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. వచ్చే ఏడాది పార్ట్ 2 పనులు స్టార్ట్ కానున్నాయి.

ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిందట. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి కేరక్టర్ చేయడానికి త్రిషని ఫస్ట్ చాయిస్‌గా అనుకుంటున్నారట. ఇప్పుడు త్రిష ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఆమె కాల్షీట్లు కుదరని పక్షంలో నయనతార ఈ కేరక్టర్‌కి సెట్ అవుతారనే మాటలు వినిపిస్తున్నాయి.