
కలిసి ఉండటం అంటే, జస్ట్ ఒకరి పక్కన ఒకరు ఉండటం కాదు... అంతకు మించి. ప్రొఫెషనల్‌గా కలిసి ట్రావెల్ చేయడానికి, క్వాలిటీగా ఫ్యామిలీ టైమ్‌ని స్పెండ్ చేయడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. రాజమౌళి దంపతులను చూసిన వారికి ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

కెమెరా వెనకాలే ఉంటారనుకునేరు... కెమెరా ముందు కూడా కేక పుట్టించేస్తున్నారు మిస్టర్ అండ్ మిసెస్ రాజమౌళి. అందమైన ప్రేమ రాణి... పాటకు రాజమౌళి, రమా కలిసి స్టెప్పులేస్తుంటే చూస్తున్న నెటిజన్లకు కూడా ఊపు వచ్చేస్తుంది. చేసే పని ఏదయినా జక్కన్న చేసినంత పర్ఫెక్ట్ గా ఇంకెవరు చేయగలరు అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు నెటిజన్లు.

ట్రిపుల్ ఆర్ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు రాజమౌళి. అందులో భాగంగానే సౌత్ ట్రిప్‌కి వెళ్లొచ్చారు. ఆస్కార్ ట్రిపుల్‌లోనే కాదు, రీసెంట్ జపాన్ ట్రిప్‌లోనూ రమ ఆయన వెంటే కనిపించారు.

త్వరలో మహేష్ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టనున్నారు జక్కన్న. ఒకసారి మహేష్ సినిమా పనులు స్టార్ట్ అయితే, ఫ్యామిలీ మొత్తం తన చుట్టూనే ఉన్నా, ధ్యాసంతా సినిమా మీదే ఉంటుంది రాజమౌళికి.

లొకేషన్‌లో కంప్లీట్‌గా ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే కనిపిస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే కుటుంబానికి, తనకు ఇష్టమైన పనులు చేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు రాజమౌళి.